పెళ్లికి నో చెప్పిన యువతి.. పగతో ఇంటికి నిప్పు

by Naga Rani Yarlagadda |

ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఓ యువకుడు అర్ధరాత్రి వేళ యువతి ఇంటికి నిప్పుపెట్టాడు.

పెళ్లికి నో చెప్పిన యువతి.. పగతో ఇంటికి నిప్పు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఓ యువకుడు అర్ధరాత్రి వేళ యువతి ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ ఘోరప్రమాదంలో 26 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలోని బిస్రా బ్లాక్ పరిధిలోని శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సదరు నిందితుడు యువతిపై తీవ్రమైన వ్యామోహాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ప్రపోజల్ ను రిజెక్ట్ చేయడంతో.. శుక్రవారం రాత్రి యువతి తన గదిలో నిద్రిస్తున్న సమయంలో.. ఆమెను చంపాలన్న ఉద్దేశంతో నిందితుడు కిటికీ గుండా గదిలోకి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు.

మంటలు అంటుకుని యువతి కేకలు పెట్టడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. అప్పటికే బాధితురాలికి 40 శాతం కాలిన గాయాలు కావడంతో.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. మంటలు అంటుకోవడానికి కొద్ది క్షణాల ముందే నిందితుడు రజత్ కిరో కిటికీ వద్ద ఉన్నట్లుగా తన తమ్ముడి భార్య గమనించినట్లు బాధితురాలి తండ్రి జెనా టొప్పో ఆరోపించారు.

Next Story