- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పనుల్లో ఇక నో రిస్క్.. పవర్ లైన్లను తనిఖీ చేసే ‘స్నేక్ రోబోలు’ వచ్చేశాయ్!
హై-వోల్టేజ్ లైవ్ పవర్ లైన్లపై నేరుగా ప్రయాణించి, పనిచేయగల అటానమస్ రోబోలను సాంకేతిక నిపుణులు డెవలప్ చేశారు.

దిశ, ఫీచర్స్ : ఎంతో ముఖ్యమైన విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతికతను విస్తరింపజేసేందుకు పరిశోధకులు చాలా కాలంగా పనిచేస్తున్నారు. అయితే రీసెంట్‌గా చైనీస్ సాంకేతిక నిపుణులు హై-వోల్టేజ్ లైవ్ పవర్ లైన్లపై నేరుగా ప్రయాణించి పనిచేయగల అటానమస్ (Autonomou)రోబోలను డెవలప్ చేశారు. వీటిని ‘స్నేక్ రోబోలు’ అని కూడా పిలుస్తున్నారు. పవర్ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ.. డ్యామేజ్ వైర్లు, ఇన్సులేటర్లు, కనెక్షన్లు, స్ట్రక్చరల్ వేర్‌ను గుర్తించడంలో ఇవి కీ రోల్ పోషిస్తున్నాయి.
హై-వోల్టేజ్ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ల పర్యవేక్షణ, నిర్వహణనలో మెరుగు పరచడంలో స్నేక్ రోబోలు సమర్థవంతంగా పచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ స్వయంచాలక రోబోటిక్ సిస్టమ్‌లు అధునాతన కెమెరాలు, సెన్సార్లు, నావిగేషన్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. పాము ఆకారంలో ఉండి.. విద్యుత్ తీగలపైన పాకుతూ.. ప్రయాణించి పవర్ లైన్లలో తలెత్తే సమస్యలను గుర్తిస్తాయి. మరొక ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఈ రోబోట్లు లైన్ల నుంచి విద్యుత్‌ను కూడా సేకరించి (హార్వెస్ట్) బ్యాటరీ లేకుండానే నడుస్తాయి. యున్నాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌లో ఈ స్నేక్ రోబోలు ఇప్పటికే 130 కిలోమీటర్లకు పైగా ట్రాన్స్‌మిషన్ లైన్లను ఇన్‌స్పెక్ట్ చేశాయని, డ్రోన్లు ఎగరలేని ఏరియాల్లో సైతం సమర్థవంతంగా పనిచేశాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
స్నేక్ రోబోలు సాంప్రదాయ మానవ ఇన్‌స్పెక్షన్ల కంటే మూడు రెట్లు ఎక్కువ సమర్థతను అందిస్తాయని వాటిని అభివృద్ధి చేసిన నిపుణులు చెబుతున్నారు. ఇవి గ్రిడ్ విశ్వసనీయతను పెంచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, సేవల్లో అంతరాయాలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయని అంటున్నారు. అంతేకాకుండా ఇవి డ్రోన్లు, హెలికాప్టర్లు, మానవులు వెళ్లి పనిచేయలేని వాతావరణ పరిస్థితుల్లోనూ వర్క్ చేస్తాయి. దీంతో ప్రమాదాలను తగ్గించి, సురక్షితమైన, నిరంతర పర్యవేక్షణతో గ్రిడ్ నిర్వహణ సామర్థ్యాలను పెంచుతాయి. అయితే ప్రస్తుతం ఈ స్నేక్ రోబోలు కేవలం చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోమేషన్ ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే.. విద్యుత్ నెట్‌వర్క్‌లను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా, రెసిలియంట్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.






