- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరులు కురిపిస్తున్న ఆయిల్ పామ్ సాగు..
రైతులు ఎక్కువగా కొత్త సాగుకు మొగ్గు చూపుతున్నారు.

దిశ, ఉప్పునుంతల: రైతులు పండించే పంట లాభం తెచ్చిపెట్టాలి.. రైతు ధనవంతుడు కావాలి.. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర సర్కార్ వినూత్న పంటలను ప్రోత్సహిస్తున్నది. అందులో భాగంగానే సిరులు కురిపించే ఆయిల్ పామ్ పంటను సాగు చేయాలని అన్నదాతకు సూచిస్తుంది. ఎకరాకు సుమారు లక్షన్నర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో పంట సాగు ఖర్చులు పోను కనీసం 80 వేలు వరకు మిగులుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో రైతుల ఇంట ఈ పంట సిరులు కురిపిస్తుందని నమ్ముతున్నారు. ఎప్పుడు ఒకే రకమైన పంటలు వేస్తూ దిగుబడులు రాక అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త భిన్నంగా ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగును తెలంగాణ రైతులకు చూపించి 2022లో సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ సాగుకు ప్రోత్సాహం చేసింది. ఫ్యాక్టరీలు అందుబాటులో లేకున్నా ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు ముందడుగు వేసి పంటలు సాగు చేశారు.ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ల తర్వాత పంటలు దిగుబడి రావడంతో దాదాపు 24 వేలు టన్నుకు ప్రభుత్వం కొనుగోలు చేసి 15 రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేయడంతో రైతులు మురిసిపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో 167 మంది రైతులు 679 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా కొత్త రైతులను ప్రోత్సహిస్తుంది. దాదాపు 500 ఎకరాల్లో కొత్త రైతులు సాగు చెయ్యటానికి దరఖాస్తులు చేసుకున్నారని పామ్ ఆయిల్ ఏరియా మేనేజర్ శివ భార్గవ్ తెలిపారు. 20 ఏళ్ల పాటు దిగుబడులను ఇచ్చే దీర్ఘకాలిక పంటగా రైతులకు లాభసాటిగా మారిందని ప్రతి రైతు ధైర్యంగా సాగుచేసుకునే పంట అని వారు సూచిస్తున్నారు.
స్థానికంగానే కొనుగోళ్ళు..
ఉప్పునుంతల మండలంలో సాగుచేసిన ఆయిల్ ఫామ్ పంట కొనుగోళ్ళు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కట్లబండ గోదాం వద్దనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు చాలా మేలు చేకూరింది.దూరం వెళ్లకుండా ఇబ్బందులు పడకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలతో కూడిన (వే బ్రిడ్జితోసహా) కొనుగోళ్లు ఏర్పాటు చేయటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ కష్టాలు దాదాపుగా గట్టెక్కినట్టేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
15 రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ..
రైతుల నుండి కొనుగోలు చేసిన పామాయిల్ పంటకు సంబంధించిన డబ్బులు 15 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 23852 రూపాయలు జమ చేస్తున్నారని వరి కొనుగోలు విధానం ఎలా ఉందో అలాగే పామ్ ఆయిల్ పంట కొనుగోలు కూడా చాలా స్పీడాఫ్ తో కొనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 15 రోజులకొక సారి లారీలను రప్పించి కొనుగోళ్ళు చేస్తున్నారని రైతులు తెలిపారు.ప్రస్తుతం ఈ పంట లాభాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని రైతులు కోరుతున్నారు.
మూడేళ్ల వరకు అంతరపంట సాగుకు అవకాశం..
పామ్ ఆయిల్ మొక్కలు నాటిన మూడేళ్ల వరకు అందులో అంతర పంట సాగుకు పూర్తి అనుకూలంగా ఉంటుందని ఉద్యన శాఖ అధికారులు సూచిస్తున్నారు వేరుశనగ, మినుము, పెసర్లు వివిధ కూరగాయల సాగులు కూడా చేసుకోవచ్చని తెలుపుతున్నారు. రైతులు కూడా దాదాపు ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు.అన్ని రకాలుగా సాగుకు రైతులు ఇష్ట పడుతున్నారన్నారు.
ఫామాయిల్ లాభసాటి పంట (కస్తూరి శ్రీహరి రైతు జప్తి సదగోడు)
నేను నాలుగేళ్ల క్రితం 5 ఎకరాల్లో పామ్ఆయిల్ పంట సాగు చేశాను. మూడున్నర సంవత్సరాలకు ఖాత వచ్చింది. నాలుగేళ్లలో 4 లక్షలు పెట్టుబడి అయ్యింది. ఇప్పటివరకు 4 టన్నులు అమ్మిన టన్ను ధర సుమారు 24 వేలు చెల్లిస్తున్నారు. మంచి లాభదాయకమైన పంట సంతోషంగా ఉంది.






