- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్ కస్టడీలో జర్నలిస్టుకు చిత్రహింసలు: విడుదలైన తర్వాత షాకింగ్ ఫోటోలు వైరల్
6 నెలల ఇజ్రాయెల్ జైలు నిర్బంధం ఓ జర్నలిస్ట్ ప్రాణాన్నే ప్రమాదంలో పడేసింది.

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుపై ఇజ్రాయెల్ (Israel) చేసిన దాష్టీకం బయటకు రావడం ప్రస్తుతం ప్రపంచమే ముక్కున వేలేసుకుంటుంది. తాజాగా పాలస్తీనాకు చెందిన జర్నలిస్ట్ ముజాహిద్ బని ముఫ్లేహ్ (Mujahid ibn Muflih) గత 6 నెలల పాటు ఇజ్రాయెల్ జైలులో ఉండి విడుదలయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన విడుదలైన తర్వాత కనిపించిన తీరు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అయితే, జైలుకు వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్న ముఫ్లేహ్ విడుదలయ్యే సమయానికి అత్యంత క్షీణించిన స్థితిలో అస్థిపంజరంలా కనిపించారు. ఆయన పుర్రెలో కొంత భాగం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. విడుదలైన 2 రోజుల్లోనే ఆయనకు మెదడులో రక్తస్రావం జరగడంతో అత్యవసర సర్జరీలు చేశారు. ప్రస్తుతం ముజాహిద్ బని ముఫ్లేహ్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
కాగా, వెస్ట్ బ్యాంక్‌లోని బీటా (Beta) పట్టణానికి చెందిన ముఫ్లేహ్‌ను ఎలాంటి అభియోగాలు లేకుండా జూన్ 2025 నుంచి జనవరి 2026 వరకు ఇజ్రాయెల్ అధికారులు నిర్బంధించారు. పాలస్తీనియన్ ప్రిజనర్ సొసైటీ (PPS) ప్రకారం.. జైలులో ఉన్న పాలస్తీనియన్ ఖైదీలకు సరైన ఆహారం, వైద్యం అందడం లేదని, వారిపై తీవ్రమైన శారీరక హింస జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 245 మంది పాలస్తీనియన్ జర్నలిస్టులను ఇజ్రాయెల్ నిర్బంధించిందని తెలుస్తోంది. అయితే, తమ జైళ్లలో ఖైదీల పట్ల క్రమపద్ధతిలో హింస జరుగుతోందన్న ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఖండించింది. చట్టబద్ధంగానే ఖైదీలను చూసుకుంటున్నామని, ఎటువంటి ఫిర్యాదులైనా విచారిస్తామని స్పష్టం చేసింది.






