అడవి జంతువు దాడిలో దూడ మృతి

by Taduka Kalyani |

దూడపై ఓ అడవి జంతువు దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది.

అడవి జంతువు దాడిలో దూడ మృతి
X

దిశ, నర్సాపూర్ : దూడపై ఓ అడవి జంతువు దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. అడవిని ఆనుకొని ఉన్న ప్రదేశంలో దూడ చనిపోయి ఉందన్న సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలం వద్ద పాదముద్రలను సేకరించిన అధికారులు హైనా దాడి వల్లనే దూడ మరణించిందని నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ దివ్య మాట్లాడుతూ.. పశువుల కాపరులు తమ పశువులను ఊరికి దూరంగా పంట చేనుల వద్ద కాకుండా సరైన రక్షణ ఉన్న ప్రదేశంలో కట్టేయాలని సూచించారు. వీరితోపాటు అటవీ సెక్షన్ అధికారి సాయిరాం మరియు బీట్ అధికారి రజిని ఉన్నారు.

Next Story