తాగే నీటిలో మురుగు నీరు.. దిశ కథనానికి స్పందన

by Taduka Kalyani |

తాగునీటిలో మురుగు నీరు కలుస్తున్న సమస్యపై 'దిశ'లో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.

తాగే నీటిలో మురుగు నీరు.. దిశ కథనానికి స్పందన
X

దిశ, రాయికోడ్ : తాగునీటిలో మురుగు నీరు కలుస్తున్న సమస్యపై 'దిశ'లో ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్ర పరిధిలోని పాంపాడ్ గ్రామంలో గత కొన్నేళ్లుగా మిషన్ భగీరథ 40 వేల లీటర్ల ట్యాంక్ నుంచి సరఫరా చేస్తున్న తాగునీటిలో మురుగు నీళ్లు కలుస్తున్నాయి. దీంతో కలుషిత నీరు తాగాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన చెందారు. ఈ అంశంపై 'దిశ' పత్రికలో శీర్షిక కథనం ప్రచురితమైంది.'దిశ' కథనానికి గ్రామ సర్పంచ్ మనోహర్ రావు, కార్యదర్శి వెంకటేశం వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో మురుగు నీరు ట్యాంక్ వద్ద నిల్వ ఉండకుండా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. భవిష్యత్‌లో మళ్లీ అలాంటి సమస్య రాకుండా ట్యాంక్ కింద నీళ్లు నిల్వ ఉండకుండా మోరం వేసి శాశ్వత పరిష్కారం చూపించారు. దీంతో ఇప్పుడు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు గ్రామానికి అందుతోంది.

'దిశ'తోనే పరిష్కారం

"ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కానీ 'దిశ'లో వార్త రాగానే అధికారులు వెంటనే స్పందించి పనులు చేయించారు. ఇప్పుడు మంచి నీళ్లు వస్తున్నాయి" అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన 'దిశ' పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story