కోతుల దాడిలో పలువురికి గాయాలు

by Jakkula.Mamatha |

మండలంతో పాటు ఇతర గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైందని, ప్రతి నిత్యం ఎక్కడో ఒకచోట కోతుల గాయాలకు బలైపోతున్నారని స్థానికులు చెబుతున్నారు.

కోతుల దాడిలో పలువురికి గాయాలు
X

దిశ, నిడమనూరు: మండలంతో పాటు ఇతర గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైందని, ప్రతి నిత్యం ఎక్కడో ఒకచోట కోతుల గాయాలకు బలైపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. మండల కేంద్రంలో వరుసగా గ్రామ పంచాయతీ బజారులో ఆడెపు వెంకటాచారి, బెస్త వాడలో నర్సింహాలను కరిచి తీవ్రంగా గాయపరిచాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటి పై కప్పులు, నీటి ట్యాంకులను , నాశనం చేస్తున్నాయి. ఆరబోసుకున్న ధాన్యం, షాపుల్లోని తినుబండారాలు, పండ్లు, కూరగాయలు, క్షణాలలో దోచుకుపోతున్నాయి. ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్ట పోతున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని కోతుల బెడద నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Next Story