ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించండి

by Ratna Kumari |

పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అడ్లూరు సర్పంచ్ కట్టా లక్ష్మీ-వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించండి
X

దిశ, శాలిగౌరారం : పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అడ్లూరు సర్పంచ్ కట్టా లక్ష్మీ-వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని అడ్లూరు గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్స్ పోలియో ప్రతి చిన్నారికి రక్షణ కవచమని అన్నారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి సూర్య శిల్ప, ఏఎన్‌ఎం సునీత, అంగన్‌వాడీ టీచర్లు జ్యోతి, పద్మ, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Next Story