- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్ న్యూస్ ప్రకటించిన నాగ్ అశ్విన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
ఆయన త్వరలోనే రెండోసారి తండ్రి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాతో టాలీవుడ్‌లో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 AD’ లాంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇటీవల ‘సింగ్‌గీతం’ చిత్రంతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన పూర్తి ఫోకస్‌ను ‘కల్కి-2’పై పెట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగ్ అశ్విన్ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన తీపి కబురును పంచుకున్నారు.
ఆయన త్వరలోనే రెండోసారి తండ్రి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. కాగా.. నాగ్ అశ్విన్ 2015లో ప్రముఖ అగ్ర నిర్మాత అశ్వనీదత్ కుమార్తె, టాలెంటెడ్ ప్రొడ్యూసర్ ప్రియాంక దత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి 2017లో ఒక బాబు జన్మించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’లో విజయ్ దేవరకొండ పోషించిన ఐకానిక్ క్యారెక్టర్ ‘రిషి’ పేరును ఇష్టపడి, తన కొడుకుకు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులు తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియాంక దత్ బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో వాటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.






