ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా వాయిదా..!

by Mallepaka Hamsa |

కొన్ని అనివార్య కారణాల వల్ల ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా వాయిదా..!
X

దిశ, సినిమా: ఘట్టమనేని కుటంబం నుంచి టాలీవుడ్‌కు మరో హీరో పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు, దివంగత రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి మంగళవారం, ఆర్‌ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ మూవీస్ సమర్పణలో చందమామకథలు పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో జయకృష్ణ సరసన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో ఘట్టమనేని హీరో యాక్టింగ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త ఘట్టమనేని అభిమానుల ఆశలను ఆవిరి చేసిందని చెప్పాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొంతమేర బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అవుట్‌పుట్, విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని దర్శకుడు అజయ్ భూపతి నిర్ణయించుకున్నారట. దాంతో పాటు సినిమా ప్రమోషన్స్ కోసం కూడా తగినంత సమయం కేటాయించాలని మేకర్స్ భావించి.. క్వాలిటీ కోసం మరికొన్ని రోజులు సమయం తీసుకుని, ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేసి కొత్త రిలీజ్ డేట్‌తో రావాలని చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వాయిదా వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుండి త్వరలోనే క్లారిటీ రానుందని టాక్.

Next Story