మగాడు మందు తాగితే త‌ప్పులేదు, ఆడది తాగితే త‌ప్పా.. బీజేపీ నేత మాధవీలత హాట్ కామెంట్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-28 11:29:22  IST  )

టాలీవుడ్ న‌టి, బీజేపీ నేత మాధ‌వీల‌త మ‌రోసారి సోష‌ల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేసింది. మగాడు మందు తాగితే చాలా నార్మ‌ల్, అదే ఆడ‌ది తాగితే బ‌రితెగించింద‌ని అంటారని పేర్కొంది.

మగాడు మందు తాగితే త‌ప్పులేదు, ఆడది తాగితే త‌ప్పా.. బీజేపీ నేత మాధవీలత హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ న‌టి, బీజేపీ నేత మాధ‌వీల‌త మ‌రోసారి సోష‌ల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేసింది. మగాడు మందు తాగితే చాలా నార్మ‌ల్, అదే ఆడ‌ది తాగితే బ‌రితెగించింద‌ని అంటారని పేర్కొంది. ఆడ‌ది ఇంటిప‌ని చేస్తే సంప్ర‌దాయిని అని అదే మ‌గాడు చేస్తే చేత‌కాని వెద‌వ‌, ఆడంగులోడు అంటార‌ని మండిప‌డింది. అస‌లు మందు తాగ‌డ‌మే త‌ప్పు అయితే ఎవ‌రు తాగినా త‌ప్పు అనారోగ్యం అని చెప్పింది. అలాగే ఇళ్లు మ‌న‌ది అయిన‌ప్పుడు ఇంటిప‌ని కూడా ఇద్ద‌రి బాధ్య‌తనే కానీ సిగ్గులేని త‌నం ఎప్పుడు అయ్యింద‌ని ప్ర‌శ్నించింది.

దీనిపై ఆలోచ‌న చేయాల‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం మాధ‌వీల‌త పోస్టు వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు త‌మ‌దైన రీతిలో స్పందిస్తున్నారు. కొంద‌రు ఆమె కామెంట్స్ కు స‌పోర్ట్ చేస్తే మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే మాధ‌వీల‌త ఇలాంటి కామెంట్స్ తో వార్త‌ల్లో నిల‌వ‌డం కొత్తేమీ కాదు. కొద్దిరోజుల క్రితం ఆమె శిరిడి సాయిబాబా దేవుడు కాదు అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో ఇప్ప‌టికీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల తెలంగాణ వాదాన్ని ఉగ్ర‌వాదం కంటే ప్ర‌మాదక‌రం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు.

Next Story