వాళ్ల వల్లే జేసీకి ఈ పరిస్థితి: కేతిరెడ్డి పెద్దారెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ చరిత్రపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

వాళ్ల వల్లే జేసీకి ఈ పరిస్థితి:  కేతిరెడ్డి పెద్దారెడ్డి సెన్సేషనల్ వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) రాజకీయ చరిత్రపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Ycp Former Mla Ketireddy Peddareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో కాంగ్రెస్‌(Congress)లో పని చేశారని, ఆ సమయంలో అప్పటి పార్టీ పెద్దలు విశ్వేశ్వర్ రెడ్డి, అనంత వెంటకరామిరెడ్డి ప్రోత్సాహంతోనే ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారని గుర్తు చేశారు. రాజకీయ, ఆర్థిక ఎదుగుదలకు మద్దతు పలికిన వారినే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దూషిస్తున్నారని విమర్శించారు. వాళ్లే లేకుండా ఇప్పుడు జేసీ ఫ్యామిలీ ఇలా ఉండేదా అని పెద్దారెడ్డి ప్రశ్నించారు.

ఎంతోమందికి నాడు..

నాడు ఎంతోమందికి జేసీ కుటుంబం టికెట్లు ఇప్పించిందని, ఇప్పుడు సొంత టికెట్ కోసం వెంపర్లాడుతోందని ఎద్దేవా చేశారు. జేసీ ఆలోచన విధానాలు మారాలని, ప్రవర్తన శృతిమించుతోందని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన చరిత్ర జేసీ ప్రభాకర్ రెడ్డిదని విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ నేతలు(Tdp Leaders) కూడా ఆయనకు సహకరించడం లేదని, అందరినీ తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. రెచ్చిగొట్టే వ్యాఖ్యలు చేసి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదని, సీఎంఆర్ఎఫ్ పండ్‌కు దరఖాస్తు చేసుకుని మెంటల్ ఆస్పత్రిలో చూపించుకోవాలని పెద్దారెడ్డి సలహా ఇచ్చారు.

Next Story