ఎమ్మెల్యే వేసిన దోశకు భళే డిమాండ్.. ఏకంగా రూ.700 పలికిన ధర

by Kema Shiva Kumar |

కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ‘ప్రజల కోసం మీ పార్థసారథి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి సందడి చేశారు.

ఎమ్మెల్యే వేసిన దోశకు భళే డిమాండ్.. ఏకంగా రూ.700 పలికిన ధర
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలిటక్స్ (AP Politics) ఎప్పుడూ వినూత్నంగానే ఉంటాయి. మాటల తూటాలతో నిత్యం నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తూనే ఉంటాయి. ఇక వాళ్లు ప్రజల్లోకి వెళితే వ్యవహరించే తీరు రకరకాలుగా ఉంటుంది. తాజాగా, కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి (MLA Parthasarathy) మాత్రం ఓ అడుగు ముందుకేసి స్వయంగా దోశలు వేసి ప్రజలను ఆకట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయన వేసిన ఆ దోశకు ఏకంగా రూ.700 ధర పలకడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే.. ఆదోని (Adoni) పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌లో ‘ప్రజల కోసం మీ పార్థసారథి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి స్థానికులతో ముచ్చటిస్తూ, అక్కడే ఉన్న ఓ హోటల్‌లోకి వెళ్లారు. అనంతరం ఆయన స్వయంగా పెనంపై గరిటె పట్టి వేడివేడి దోశ వేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే స్వహస్తాలతో వేసిన దోశ కావడంతో అక్కడున్న నాయకులు సరదాగా ఆ దోశకు అక్కడికక్కడే వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరకు మల్లిక అనే స్థానిక బీజేపీ మహిళా నాయకురాలు ఏకంగా రూ.700 వెచ్చించి, ఎమ్మెల్యే చేతి ఆ ప్రత్యేక దోశను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అవుతున్నాయి.

Next Story