‘ష్రెక్కింగ్’ డేటింగ్ ట్రెండ్..! ఆకర్షణ, స్థిరత్వం.. ఏది ముఖ్యం?

by Javid Pasha |

ఒకరు కేవలం సౌకర్యం కోసం ప్రేమిస్తే.. మరొకరు నిజమైన ప్రేమను ఆశిస్తారు. ఇలాంటి బంధంలో భావోద్వేగ సామీప్యత లేకపోతే అది బలహీనపడుతుంది.

‘ష్రెక్కింగ్’ డేటింగ్ ట్రెండ్..! ఆకర్షణ, స్థిరత్వం.. ఏది ముఖ్యం?
X

దిశ, ఫీచర్స్ : తాము డేటింగ్ చేయబోయే వ్యక్తి లేదా పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని చాలామంది కలలు గంటుంటారు. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంతెందుకు జెన్-Z ప్రేమలన్నీ ఈ అందం, ఆకర్షణల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు యువతరం ఆలోచనలు మారుతున్నాయి. అందం, ఆకర్షణల కంటే.. నమ్మకం, స్థిరత్వం ముఖ్యమని భావిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిందే ‘ష్రెక్కింగ్’ డేటింగ్ ట్రెండ్. ప్రస్తుతం చాలామంది దీనిపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఏమిటీ ఆధునిక డేటింగ్? లాభమా? నష్టమా?

అడ్జస్ట్‌మెంట్ ముఖ్యం!

సులభంగా చెప్పాలంటే.. శారీరకంగా ఆకర్షణ లేని లేదా మీ స్టాండర్డ్ కంటే తక్కువగా ఉన్న వ్యక్తిని డేట్ చేయడమే ష్రెక్కింగ్ డేటింగ్ ట్రెండ్ ప్రధాన ఉద్దేశం. ఇటీవల జెన్ Z మధ్య ఇది పెరుగుతోంది. ఎందుకిలా అంటే.. అతను/ఆమె మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. నమ్మకంగా ఉంటారు. విడిపోయే అవకాశం దాదాపు ఉండదు. అన్ని విషయాల్లోనూ అడ్జస్ట్ అవుతూ, అర్థం చేసుకుంటూ పరస్పర సహకారంతో, గౌరవంతో ముందుకు సాగుతారు. నిజానికి ఇది యానిమేటెడ్ చిత్రం ష్రెక్ నుంచి వచ్చింది. అందులో ఏమాత్రం లేని ష్రెక్‌ను ఫియోనా ప్రేమించినట్లు, తక్కువ ఆకర్షణ ఉన్న వ్యక్తిని ఎంచుకోవడమే ఈ కొత్త ధోరణిలో భాగం.

నష్టాలు

వ్యక్తుల మధ్య శారీరక ఆకర్షణ లేకపోతే కాలక్రమేణా బోర్ కొడుతుంది. అసంతృప్తి వస్తుంది అనే వాదలను సైతం ఉన్నాయి. ఈ విధమైన(ష్రెక్కింగ్) డేటింగ్‌లో ఒకరు కేవలం సౌకర్యం కోసం ప్రేమిస్తే.. మరొకరు నిజమైన ప్రేమను ఆశిస్తారు. అంటే ఇక్కడ భావోద్వేగ సామీప్యత (కెమిస్ట్రీ) తక్కువగా ఉండటంవల్ల సంబంధం బలహీనమవుతుంది. కాబట్టి అందం, ఆకర్షణ కూడా ముఖ్యమే అంటారు పలువురు నిపుణులు.

లాభాలు

అందం, ఆకర్షణకు ప్రభావితమై (నాన్‌ష్రెక్కింగ్) డేటింగ్ చేయడం లేదా ప్రేమ, పెళ్లి వంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే జీవితం కాదు. పైగా ఇవి రెండూ కలిగి ఉన్న వ్యక్తులు చాలా వరకు టాక్సిక్ మెంటాలిటీని కలిగి ఉంటారనే వాదన కూడా ఉంది. దీంతో ఈ సంబంధం మొదట్లో బాగానే ఉన్నా కొంతకాలానికి ఆకర్షణ తగ్గి, సమస్యలు తలెత్తడం, బ్రేకప్‌లు, విడాకులకు దారితీయడం జరిగే చాన్సెస్ ఎక్కువ. కాబట్టి అందంకంటే స్థిరత్వం, వ్యక్తిత్వం, పరస్పర సహకారం, అర్థం చేసుకునే మనస్తత్వం వంటివి ముఖ్యం. కాబట్టి ష్రెక్కింగ్ డేటింగ్ ట్రెండ్ దీర్ఘకాలిక సంబంధాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం జెన్ Z దీనిపై మొగ్గు చూపుతోంది.

Next Story