- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిరుధ్ రవిచందర్-కావ్యా మారన్ పెళ్లి.. కన్ఫార్మ్ చేస్తూ నటుడు ఆసక్తికర కామెంట్స్!
ఈ పెళ్లి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. అనిరుధ్, కావ్యా మారన్ల జోడీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజన్స్ హైదరాబాద్ ఫ్రాంచైజికి అధినేతగా వ్యవహరిస్తున్న కావ్యా మారన్ ప్రేమించుకుంటున్నారంటూ గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ.. పలు పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు చాలాకాలంగా వస్తున్నప్పటికీ వీరిద్దరు మాత్రం అధికారికంగా స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. అనిరుధ్, కావ్య పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం వస్తున్న తరుణంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుధ్ పెదనాన్న, నటుడు వైజి మహేంద్రన్ ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు సంతోష పడుతున్నారు. మరికొందరు షాక్‌కు గురవుతున్నారు. ఈ పెళ్లి రూమర్లపై వైజీ మహేంద్రన్ స్పందిస్తూ.. "నేను కూడా బయట విన్నదాన్ని బట్టే చెప్తున్నప్పటికీ.. ఈ పెళ్లి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. అనిరుధ్, కావ్యా మారన్ల జోడీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి జంటగా పేరు తెచ్చుకుంటారు. అనిరుధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అతనికి నా శుభాకాంక్షలు ముందే తెలుపుతున్నాను" అని స్పష్టం చేశారు. అలాగే అనిరుధ్ పెళ్లి ఆలస్యం అవ్వడంపై మాట్లాడుతూ.. "అనిరుధ్ చాలా సమర్థుడు.
అయితే ఏదో ఒక విషయం అతని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ప్రస్తుతం ఆపుతోంది. త్వరలోనే ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయని నేను ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఇక కావ్యా మారన్ పర్సనాలిటీ, ఆమె బిజినెస్ నాలెడ్జ్ గురించి చెబుతూ.. "కావ్యా మారన్ కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్‌గా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. కళానిధి మారన్ బిజినెస్ జీన్స్‌ను పూర్తిగా పుణికిపుచ్చుకోవడం వల్లే కావ్యా మారన్ అంత పెద్ద ఐపీఎల్ టీమ్‌ను విజయవంతంగా హ్యాండిల్ చేస్తోంది" అని కొనియాడారు. గతంలో ఆమెతో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ.. "గతంలో కావ్యా మారన్ సన్ టీవీ ఓటీటీ విభాగానికి హెడ్‌గా ఉన్న సమయంలో ఒక ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం నేను ఆమె వద్దకు వెళ్లాను. అప్పుడు ఆమె నాతో చాలా మర్యాదగా మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారు ఆ ఓటీటీ ప్రాజెక్ట్‌లను కొంతకాలం నిలిపివేసినప్పటికీ.. ఒక వ్యక్తిగా కావ్యా మారన్ చాలా మంచి మనసున్న అమ్మాయి" అని కావ్యా మారన్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అప్పుడే కంగ్రాట్స్ చెబుతున్నారు.






