కేజీబీవీలో అధ్యాపకుల కోసం దరఖాస్తుల స్వీకరణ

by Jakkula.Mamatha |

మండల కేంద్రమైన రేగోడ్ కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేకాధికారి స్వయంప్రభ తెలిపారు.

కేజీబీవీలో అధ్యాపకుల కోసం దరఖాస్తుల స్వీకరణ
X

దిశ,రేగోడ్: మండల కేంద్రమైన రేగోడ్ కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేకాధికారి స్వయంప్రభ తెలిపారు. పీజీసీఆర్టీగా ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు గాను పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఈడీ సర్టిఫికెట్స్‌తో పాటు అనుభవం కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మ్యాథ్స్(1), ఫిజిక్స్(1), ఇంగ్లీష్(1) పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో జూలై 2వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

Next Story