- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యాభర్తల అదృశ్యం
ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు అదృశ్యమైన సంఘటన పోచారం ఐటీసీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, ఘట్కేసర్: ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు అదృశ్యమైన సంఘటన పోచారం ఐటీసీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఐదు సంవత్సరాల క్రితం వనమాల గిరీష్ కుమార్(39) తన భార్యతో కలిసి ఘట్‌కేసర్ డివిజన్ బొక్కోనిగూడలోని ఇంట్లో అద్దెకు ఉంటూ పోచారం డివిజన్ యమ్నంపేటలో ఒక గ్లాస్ కంపెనీని స్థాపించాడు. ఈ నెల 25వ తేదీన గిరీష్ కుమార్ తన సోదరుడు వనమాల హరీష్ కుమార్ తో వ్యాపార విషయం గురించి చర్చించారు. ఆ మరుసటి(26వ తేదీన) రోజు హరీష్ కుమార్ అన్న గిరీష్, వదిన వనమాల అనిత(35)కు ఫోన్ చేయగా, వారు స్పందించలేదు.
వెంటనే తన సోదరుడి ఇంటికి వెళ్లి చూడగా ఇంటి తలుపులు తాళం వేయకుండా మూసి ఉంది. ఇంటి లోపల తన అన్న, వదినల ఫోన్లు మంచం మీద కనిపించాయి. ఆ తర్వాత యంనంపేటలోని సోదరుడి కంపెనీకి వెళ్లి చూస్తే కార్ షెడ్డు వద్ద గిరీష్ కారు కనిపించింది. గులామ్ అనే కార్మికుడిని విచారించగా ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కారు పార్కింగ్ చేసి యంనంపేట రోడ్డు వైపు వెళ్లారని అతను తెలిపాడు. వెంటనే అన్న, వదినల కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో హరీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సోదరుడు, వదిన ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉండవచ్చని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






