- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తేదీన 'లెనిన్' ట్రైలర్.. భారీ స్కెచ్ వేసిన నాగ వంశీ
'లెనిన్' సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను జూన్ 30న గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం 'లెనిన్'. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీ సమీపిస్తున్నప్పటికీ ప్రమోషన్స్ పెద్దగా ప్రారంభం కాకపోవడంతో అక్కినేని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఇలాంటి సమయంలో నిర్మాత నాగ వంశీ ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేలా భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం జూన్ 30న 'లెనిన్' ట్రైలర్‌ను గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచాలన్నది నాగ వంశీ వ్యూహంగా తెలుస్తోంది. ఆయన ప్రణాళిక విజయవంతమైతే 'లెనిన్'పై భారీ బజ్ ఏర్పడే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






