- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరి దశకు సంబరాల ఏటిగట్టు.. సాయి దుర్గ తేజ్ కి అసలైన పరీక్ష
'సంబరాల ఏటిగట్టు' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు (SYG)' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోహిత్ కె.పీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా 'సంబరాల ఏటిగట్టు' నిలవనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే సాయి దుర్గ తేజ్ మార్కెట్‌తో పాటు స్టార్‌డమ్ కూడా మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రంతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.






