రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనంలో మంటలు

by Jakkula.Mamatha |

రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు అంటుకుని దగ్ధమైన ఘటన ఆదివారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్ పి అండ్ టి కాలనీలో జరిగింది.

రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనంలో మంటలు
X

దిశ, చైతన్యపురి: రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనంలో ఆకస్మాత్తుగా మంటలు అంటుకుని దగ్ధమైన ఘటన ఆదివారం ఉదయం దిల్‌సుఖ్‌నగర్ పి అండ్ టి కాలనీలో జరిగింది. శివగంగా కాలనీలో నివాసం ఉండే నల్లబోతుల ముఖేష్ బిగ్ బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తన యాక్టివా 5జీ 2023 మోడల్ వాహనం ద్వారా డెలివరీ చేయుటకు పీఎన్టీ కాలనీ రోడ్, 1/3.సాయిబాబా టెంపుల్ లైన్ సమీపంలో రాగానే రన్నింగ్‌లో ఉన్న వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే అతను బైక్ పై నుంచి దూకేశాడు. సమీపంలో టీ స్టాల్ నిర్వహిస్తున్న వ్యక్తులు వెంటనే స్పందించి గోనె సంచులు తడిపి వాహనంపై వేసి మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల వాహనం పూర్తిగా తగలబడి పోవడంతో ముఖేష్ జీవనోపాధి కోల్పోయాడు.

Next Story