- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ పై దారుణం.. 5 రోజుల్లో 30 మంది అత్యాచారం
దేశంలో అత్యంత ఘోరమైన, అమానుష ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై 5 రోజులపాటు సుమారు 30 మందికి పైగా మృగాళ్లు పలు హోటళ్లలో అత్యాచారానికి ఒడిగట్టిన ఆరోపణలు వచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అత్యంత ఘోరమైన, అమానుష ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల మైనర్ బాలికపై 5 రోజులపాటు సుమారు 30 మందికి పైగా మృగాళ్లు పలు హోటళ్లలో అత్యాచారానికి ఒడిగట్టిన ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్లోని శ్రీ గంగనగర్లో ఈ ఘోరమైన ఘటన జరిగింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన బాలికను రిక్షా కార్మికుడు హోటల్ యజమానికి విక్రయించాడు. దాంతో ఈ దారుణం ప్రారంభమైనట్లుగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది. ఈ వికృత కాండలో పలువురు హోటల్ నిర్వాహకుల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘోరాన్ని బయటకు రాకుండా తొక్కేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
లైంగిక దాడుల కారణంగా బాధితురాలు తీవ్రనొప్పితో బాధపడుతుండగా.. తనకు బలవంతంగా మద్యం తాగించినట్లు వాపోయింది. ఇప్పటికే బాధితురాలు చెప్పిన హోటళ్ల యజమానులు, మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీగంగానగర్ పర్యాటకంగా పెద్దగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాకపోయినప్పటికీ 150కి పైగా హోటళ్లు ఉన్నాయి. తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో వాటన్నింటినీ మూసివేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టి.. రిక్షాడ్రైవర్ తో పాటు కేసులో ఉన్న ప్రతి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కరణ్ పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కున్నర్.. నిరసనలో పాల్గొని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కేసులో తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల్ని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేసింది.






