సోషల్ మీడియా 'సబ్‌స్క్రిప్షన్' మాయ: పెరిగిపోతున్న తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్లు!

by Gantepaka Srikanth |

ఒకప్పుడు చదువుకుంటేనే గుర్తింపు. కష్టపడి ఉద్యోగం చేస్తేనే స్థిరపడతాం అనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ నమ్మకాలు మారుతున్నాయి.

సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్ మాయ: పెరిగిపోతున్న తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు చదువుకుంటేనే గుర్తింపు. కష్టపడి ఉద్యోగం చేస్తేనే స్థిరపడతాం అనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ నమ్మకాలు మారుతున్నాయి. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ (Instagram) తీసుకొచ్చిన 'సబ్‌స్క్రిప్షన్' ఫీచర్ చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు జీవితాలను రాత్రికి రాత్రే మార్చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద చదువులు చదివి. టార్గెట్లతో కుస్తీ పడుతూ నెలంతా కష్టపడినా రాని జీతం.. ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం కొన్ని గంటల కంటెంట్‌తో సంపాదిస్తున్నారు. ఇది చూస్తున్న సామాన్యులకు, నిరుద్యోగులకు "మేము ఇన్ని ఏళ్లు కష్టపడి చదువుకుంది ఇందుకేనా?" అనే నిరాశ ఎదురవుతోంది.

ఒంటి మీద చెమట పట్టదు.. టార్గెట్లు ఉండవు!

సాధారణ ఉద్యోగి ఉదయం నుంచి రాత్రి వరకు బాస్ తిట్లు తింటూ, డెడ్‌లైన్లు దాటుకుంటూ, ఒంటి మీద చెమటలు కక్కుతూ పని చేయాలి. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రపంచం వేరుగా కనిపిస్తోంది. వారికి ఎలాంటి మేనేజర్లు ఉండరు. మంత్లీ టార్గెట్లు ఉండవు. ఒక కెమెరా, ఒక ఫోన్ ఉంటే చాలు.. ఇంట్లో కూర్చుని లేదా విదేశాల్లో తిరుగుతూ డబ్బులు సంపాదించవచ్చు. కేవలం 'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్' (Exclusive Content) పేరుతో సబ్ స్క్రిప్షన్స్ పెట్టి, ఫాలోవర్ల నుంచి నేరుగా నేలకు వందల రూపాయలు వసూలు చేస్తూ లక్షల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. రోజురోజుకూ తెలుగు సోషల్ మీడియాలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.

తప్పు పట్టలేం... కానీ సమాజం ఎటు వెళ్తేంది?

ఎవరి వ్యక్తిగత జీవితం వారిష్టం, ఎవరి సంపాదన మార్గం వారిది. ఇందులో ఎవరినీ తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే వారికి ఆ క్రేజ్, డబ్బు వస్తున్నాయి. అయితే, ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతోంది. ఈ ధోరణి సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్తుందా? లేక యువతను కేవలం సులువైన డబ్బు (Easy Money) వైపు మళ్లించి చెడును ప్రోత్సహిస్తోందా? అనేది వారిని ఫాలో అయ్యే వారికి డబ్బులు కట్టి సబ్స్క్రైబ్ చేసుకునే నెటిజన్లే ఆలోచించుకోవాలి. కష్టపడి చదివే చదువుకు, సమాజ నిర్మాణానికి ఉపయోగపడే వృత్తులకు విలువ తగ్గుతూ.. కేవలం వినోదం, రీల్స్ చేసే వారికే విపరీతమైన ప్రాధాన్యత దక్కడం భవిష్యత్ తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

Next Story