ఆ ప్రొడక్షన్ హౌస్ సూపర్.. ట్యాంక్ నిండా వైన్ ఉండేది: షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమని

by Pulgam srinivas |

'హ్యాపీ జర్నీ' సినిమా ప్రొడక్షన్ హౌస్ వైన్ ట్యాంక్ నిండా నిల్వ ఉంచేవారని ఆమని వెల్లడించింది.

ఆ ప్రొడక్షన్ హౌస్ సూపర్.. ట్యాంక్ నిండా వైన్ ఉండేది: షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమని
X

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో, సీనియర్ స్టార్ హీరోల సరసన నటించిన ఆమె, తన అందం మరియు అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా కెరీర్‌ను కొనసాగిస్తోంది. తాజాగా ఆమని 'హ్యాపీ జర్నీ' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ ఎంతో అద్భుతమైనది. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు.

మాకు ఏది కావాలన్నా వెంటనే ఏర్పాటు చేసేవారు. నేను డైట్‌ను కూడా పక్కన పెట్టి తినాల్సి వచ్చింది. చికెన్, మటన్ మాత్రమే కాదు, రాబిట్ మాంసం కూడా వడ్డించేవారు. అంతేకాదు, వైన్ ఒక ట్యాంక్ నిండా నిల్వ ఉంచేవారు. ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకుని తాగేవారు. అంత గొప్పగా చూసుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే, తాను వెజిటేరియన్ కావడంతో చికెన్, మటన్, రాబిట్ వంటి నాన్‌వెజ్ ఆహారం మాత్రం తినలేదని ఆమని తెలిపింది. "ఇలాంటి మంచి ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్‌కు దొరకడం నిజంగా అదృష్టం" అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story