టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట స్పెషల్ డ్రైవ్..

by Kodari Anjali |

పెద్దకొత్తపల్లి మండలంలో టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఆదివారం వేడుకరావు పల్లి గ్రామంలో బడిబాట స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట స్పెషల్ డ్రైవ్..
X

దిశ, పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లి మండలంలో టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఆదివారం వేడుకరావు పల్లి గ్రామంలో బడిబాట స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆర్, కృష్ణ ముఖ్య ఆహ్వానితులుగా హాజరై గ్రామంలోని బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన భాద్యత గ్రామంలోని ప్రతీ పౌరునిపై ఉందన్నారు. అలాగే ప్రభుత్వ బడులల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, అందుకు పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని తెలుపుతూ, ప్రభుత్వ బడిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటపాటలతో, ఉత్తమ భోధనా పద్ధతుల్లో బోధన, ఉచిత సౌకర్యాలు ఉంటాయనీ ఆయన పేర్కొన్నారు. అందువల్ల పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు గ్రామస్తులు, నాయకులు ప్రత్యేక చొరవ చూపాలని కృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్ డబ్ల్యూఎస్ కన్వీనర్ పీ, మహేష్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి డీ మల్లయ్య, ఉపాధ్యక్షులు ఎన్. రాజు, కోశాధికారి వీ. లక్ష్మీపతి, మండల నాయకులు ఎస్. కిరణ్, గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయుడు తిరుపతయ్య , గ్రామ సర్పంచ్ లాలి బాలు నాయక్, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story