- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారులు చిన్నచూపు చూస్తున్నారు.. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
అధికారులు చిన్నచూపు చూస్తున్నారు అంటూ ఏపీలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతపురంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాసనాయక్ పోలీస్ వాహనాలకు అధికారులు నిధులు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: అధికారులు చిన్నచూపు చూస్తున్నారు అంటూ ఏపీలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతపురంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాసనాయక్ పోలీస్ వాహనాలకు అధికారులు నిధులు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తనను చిన్నచూపు చూస్తున్నారంటే కత్తితో ఛాతీపై పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రిపేర్ల కోసం తాను తన తల్లి హుండీ నుండి డబ్బులు వాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగానే ఉంది.
ఒక వాహనం రిపేర్ వస్తే 20వేలు ఖర్చు చేశానని, మరో యాక్సిడెంట్ అయితే 60వేలు పెట్టుకున్నానని చెప్పాడు. ఇంట్లో గొడవలు అవుతున్నాయని, డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడుతున్నారని తెలిపాడు. అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు పొడుచుకున్నట్టు చూపించాడు. మంచితనం ఎక్కడ ఉంది అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అతడిని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.






