మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: సీఐ కరుణాకర్

by Jakkula.Mamatha |

మాజీ ప్రధాని భారతరత్న పీవీ నర్సింహా రావు జీవితాన్ని మనందరం స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పట్టణ సీఐ కరుణాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: సీఐ కరుణాకర్
X

దిశ,హుజూరాబాద్ రూరల్: మాజీ ప్రధాని భారతరత్న పీవీ నర్సింహా రావు జీవితాన్ని మనందరం స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని పట్టణ సీఐ కరుణాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పీవీ సేవా సమితి, ఆలయన్స్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు పీవీ 105 వ జయంతి వేడుకలను పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ పీవీ మార్గ్ వద్ద ఘనంగా నిర్వహించి మిఠాయిలు పంచారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ కరుణాకర్ పీవీకి పూల మాల వేశారు. తదనంతరం మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం నుంచి తొలి తెలుగు ప్రధానిగా చరిత్రలో తన స్థానాన్ని, స్థాయిని స్థిరపరుచుకున్నారని తెలిపారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అనేక ఆర్థిక సంస్కరణలు దేశం ప్రగతి పథం వైపు నడిచేలా దోహద పడ్డాయాని అన్నారు.

నేటికీ ఆచరరించబడుతున్నాయని సీఐ అభిప్రాయపడ్డారు. సంస్కరణల పితామహుడిగా, బహుభాష కోవిదుడుగా అపర చాణక్యుడిగా.. పీవీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. వారి జీవితం మనకు ఆదర్శమని, వారు ఈ ప్రాంత వాసిగా తెలుగు వారందరికీ గర్వకారణం అని అన్నారు. పీవీ సేవ సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ దేశానికి అందించిన విశిష్ట సేవలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీవీ సేవా సమితి, ఆలయన్స్ క్లబ్ అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి, బి.మనోజ్ డాక్టర్ తోగరు విద్యాసాగర్, బీసీ నాయకులు చందుపట్ల జనార్దన్, సందేల, వెంకన్న బీజేపీ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, మంచికట్ల మురళి, విష్ణు దాస్ గోపాల్ రావు, మహాలక్ష్మి సీడ్స్ సంపత్ రావు, కాసార్ల శ్రీహరి, మురికి గౌరీశంకర్, ముక్కెర కన్నయ్య, కల్లెపు రాఘవ రావు, కరాటే రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story