- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలియో రహిత సమాజమే మన లక్ష్యం: ఐటీడీఏ పీవో
పోలియో రహిత సమాజమే మన లక్ష్యమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు.

దిశ, ఉట్నూర్: పోలియో రహిత సమాజమే మన లక్ష్యమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరందు, సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, ఏజెన్సీ డీఎంహెచ్ఓ మనోహర్ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పోలియో ఒక ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ, పోలియో చుక్కల ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చన్నారు.
ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేల వైద్య సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఒక్క చిన్నారిని కూడా వదలకుండా అందరికీ ఈ రక్షణ అందేలా తల్లిదండ్రులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది అందరు కలిసి పనిచేయాలన్నారు. అని అందరి సహకారంతోనే పోలియో రహిత, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని ప్రతి చిన్నారి ఆరోగ్యం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






