- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్ జీని టార్గెట్ చేసిన 'మెగా 158'.. అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు వైరల్
'మెగా 158'ను జెన్-జీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బాబి తెరకెక్కిస్తున్నారని గేయరచయిత అనంత శ్రీరామ్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, షూటింగ్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ లిరిసిస్ట్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు, "ప్రస్తుతం మీరు 'మెగా 158' చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా ఎలా వస్తోంది? దర్శకుడు బాబి మీకు ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తున్నారు?" అనే ప్రశ్న ఎదురైంది.
దానికి అనంత శ్రీరామ్ స్పందిస్తూ.. "ఈ సినిమా ఎక్కువ భాగం గోదావరి నేపథ్యంలో సాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అయినప్పటికీ, నేటి తరం ప్రేక్షకులు, ముఖ్యంగా జెన్-జీకి కనెక్ట్ అయ్యేలా బాబి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే నేను ఈ సినిమాకు ఓ పాట కూడా రాశాను. ఆ పాట జెన్-జీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను" అని తెలిపారు. అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనశ్వర రాజన్, చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






