- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాంకి గ్రామంలో విషాదం.. ఫీల్డ్ అసిస్టెంట్ హఠాత్ మరణం
మండలం కేంద్రంలోని యాంకి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జి.అంజన్న( 47) అకాల మరణం చెందడం జరిగిందని ఎంపీడీవో శ్రీనివాసులు తెలియజేశారు.

దిశ, నర్వ: మండలం కేంద్రంలోని యాంకి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జి.అంజన్న( 47) అకాల మరణం చెందడం జరిగిందని ఎంపీడీవో శ్రీనివాసులు తెలియజేశారు. అంజికి ఇద్దరు కుమార్తెలు భార్య కలదు. అంజి వృత్తి రీత్యా ఫీల్డ్ అసిస్టెంట్‌గా జీవనం సాగిస్తూ ఉండేవాడు. నిన్న అకస్మాత్తుగా అధిక రక్తపోటు రావడంతో హుటాహుటిన జిల్లా నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అంజి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ చికిత్స నిమిత్తం తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
ఈరోజు వేకువ జామున ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. అంజి మృతి పట్ల మండల అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నర్వ మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు అంజి ఫొటోకు పూలమాలవేసి సంతాప సభను నిర్వహించినట్లు ఎంపీడీవో తెలిపారు. అనంతరం యాంకి గ్రామానికి చేరుకొని ఎంపీడీవోతో పాటు తోటి ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బంది వెళ్లి అంజి అంత్యక్రియలకు గాను 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అంజి మృతి పట్ల గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాఘవేందర్, ఏపీవో గౌరీశంకర్ గౌడ్ అంజన్న, తోటి ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బంది పాల్గొన్నారు.






