‘గార్గి’ అవకాశాన్ని అందుకే వదులుకున్నా.. కానీ ఇప్పటికీ బాధపడుతున్నానంటూ ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్

by Mallepaka Hamsa |

ఆ సమయంలో ఆ పాత్రకు మరింత పెద్ద స్థాయి ఉన్న హీరోయిన్ అయితేనే న్యాయం చేయగలదని భావించి తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘గార్గి’ అవకాశాన్ని అందుకే వదులుకున్నా.. కానీ ఇప్పటికీ బాధపడుతున్నానంటూ ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గట్ట కుస్తీ-2’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘గట్ట కుస్తీ’కి సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. స్పోర్ట్స్, కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను చెల్లా అయ్యావు తెరకెక్కించారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 3న థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఐశ్వర్య లక్ష్మి ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘గార్గి’లో ఆఫర్ మొదట తనకే వచ్చిందని ఆమె వెల్లడించారు. కోవిడ్‌కు ముందు దర్శకుడు తనకు ఈ కథను వినిపించినప్పుడు, ఆ పాత్రను తాను తిరస్కరించినట్లు ఐశ్వర్య లక్ష్మి తెలిపారు.

ఆ సమయంలో ఆ పాత్రకు మరింత పెద్ద స్థాయి ఉన్న హీరోయిన్ అయితేనే న్యాయం చేయగలదని భావించి తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే, అంతటి గొప్ప పాత్రను వదులుకున్నందుకు తనకు ఇప్పటికీ ఎంతో బాధగా అనిపిస్తూనే ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అదే ‘గార్గి’ కథ ఇప్పుడు గానీ తన దగ్గరకు వచ్చి ఉంటే.. ఎలాంటి ఆలోచన లేకుండా చాలా సంతోషంగా ఆ పాత్రను చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చారు. నటిగా ఆ పాత్రను వదులుకున్నప్పటికీ.. దర్శకుడి విజన్‌పై, కథపై ఉన్న నమ్మకంతోనే తాను ఈ ‘గార్గి’ చిత్రానికి సహ-నిర్మాతగా మారి సపోర్ట్ చేసినట్లు ఐశ్వర్య లక్ష్మి వివరించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఆ పాత్ర ఐశ్వర్యకు సెట్ కాదని అంటుంటే మరికొందరు మాత్రం.. తనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story