- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగ్ అశ్విన్ ఆఫర్‌ను తిరస్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్
నాగ్ అశ్విన్ మొదట ఈ సినిమాలో బుజ్జి పాత్ర కాకుండా మరో క్యారెక్టర్ చేయమని అడిగారని కీర్తి సురేష్ తెలిపారు.

దిశ, సినిమా: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా ‘కల్కి’. ఈ మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించగా, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒక కీలక పాత్రలో భాగమయ్యారు. సినిమాలో నేరుగా కనిపించకపోయినప్పటికీ.. తన వాయిస్‌తో ‘బుజ్జి’ పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ‘కల్కి’లో తాను భాగమవ్వడం వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నాగ్ అశ్విన్ మొదట ఈ సినిమాలో బుజ్జి పాత్ర కాకుండా మరో క్యారెక్టర్ చేయమని అడిగారని కీర్తి సురేష్ తెలిపారు. అయితే ఆ పాత్ర విన్నప్పుడు తనకు ఎందుకో అంతగా నమ్మకం కలగలేదని, అందుకే దానికి నో చెప్పానని వివరించారు.
కానీ ఆ తర్వాత రోజే నాగ్ అశ్విన్ మళ్లీ ఫోన్ చేసి, తన వద్ద మరో అద్భుతమైన పాత్ర ఉందని, కనీసం అదైనా చేస్తావా అని అడిగారని చెప్పారు. ఆయన సినిమాలో కచ్చితంగా ఏదో ఒక విధంగా తాను భాగమవుతానని తనకు ముందే తెలుసని కీర్తి పేర్కొన్నారు. నిజానికి మొదట వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినందుకు తనకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని, ఒకవేళ దానికి ఓకే చెప్పి ఉంటే తనకు ఇంతటి గుర్తింపు తెచ్చిన ‘బుజ్జి’ పాత్ర దక్కేది కాదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నాగ్ అశ్విన్ రెండోసారి బుజ్జి పాత్ర గురించి చెప్పినప్పుడు కేవలం వాయిస్ అందిస్తే చాలని అన్నారని కీర్తి సురేష్ గుర్తుచేసుకున్నారు. దాంతో తనకు ఏమీ అర్థం కాక, తాను షూటింగ్‌కు రావాల్సిన అవసరం లేదా అని ఆయన్ని అడిగినట్లు చెప్పారు. దానికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. షూటింగ్ ఏమీ అవసరం లేదని, కేవలం నీ వాయిస్ మాత్రమే కావాలని అనడంతో తనకు చాలా సంతోషంగా అనిపించిందని, అదే సమయంలో కొంత ఆశ్చర్యానికి, షాక్‌కు గురయ్యానని తెలిపారు. సినిమాలో నటించకుండా కేవలం గొంతుతో క్యారెక్టర్‌ను పండించడం అనేది సరికొత్తగా అనిపించడంతో, తాను వెంటనే ఈ బుజ్జి పాత్రకు ఓకే చెప్పానని కీర్తి సురేష్ వివరించారు.






