- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్, అమెరికాలకు నరకం అంటే ఏంటో చూపిస్తాం.. ఇరాన్ భీకర హెచ్చరిక
అమెరికా దాడులకు ఇరాన్ భీకర ప్రతిఘటన.. కువైట్, బహ్రెయిన్‌లలోని 8 యూఎస్ సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్!

దిశ, వెబ్ డెస్క్: మొన్నటి వరకు శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ వైపు వెళ్లిన అమెరికా, ఇరాన్.. దేశాలు తాజాగా భారీ హెచ్చరికలు చేసుకుంటున్నారు. ఇరాన్ హార్మూజ్ జలసందిలోని నౌకలపై డ్రోన్లతో దాడి చేయగా.. అమెరికా సైన్యం డ్రోన్స్ ల్యాంచింగ్ పాడ్స్ ను టార్గెట్ చేసుకొని వరుసగా రెండోసారి దాడులు చేసింది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడిచిన ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పై ఒక్క దాడి జరిగిన అమెరికా సైనిక చర్యలను పూర్తి చేస్తుందని, ఇరాన్ ను ప్రపంచంలో లేకుండా చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే అమెరికా చేసిన దాడులపై కూడా ఇరాన్ ఘాటుగా స్పందించింది.
దాడుల నెపంతో తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ అమెరికా, ఇజ్రాయేల్ కూటమి గనుక స్వల్పంగా నైనా ముందడుగు వేస్తే.. ఈసారి యుద్ధం మునుపటిలా ఉండదని, శత్రువులు ఊహించని రీతిలో భారీ మానవ నష్టాన్ని (High Casualties) చవిచూడాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు మొహమ్మద్ రెజాయ్ స్పష్టం చేశారు. పొరుగు దేశాల వైమానిక పరిధిని వాడుకుంటూ ఇరాన్ సరిహద్దుల సమీపంలో ఇజ్రాయేల్ యుద్ధ విమానాలు తిరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, అమెరికా గనుక ఇజ్రాయేల్‌ను అదుపులో పెట్టకపోతే తాము చూస్తూ ఊరుకోబోమని, తమ క్షిపణులన్నీ ఇప్పటికే ఇజ్రాయేల్ లక్ష్యాల వైపు సిద్ధంగా (Missiles Loaded) ఉన్నాయని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఘోరంగా ఉల్లంఘించి ఇరాన్ తీరప్రాంతాలపై దాడులకు తెగబడటాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్, జియోనిస్ట్ (ఇజ్రాయేల్) శక్తులు ఏ నెపంతో తమపై దాడికి దిగినా, అంతకంటే దారుణమైన నరకాన్ని, తిరుగులేని సమాధానాన్ని (Crushing Response) రుచి చూపిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా.. అమెరికా బలగాలకు ఆశ్రయమిస్తున్న ప్రాంతీయ స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. తమ దేశ భద్రత విషయంలో ఎంతటి తీవ్ర నిర్ణయాల కైనా వెనుకాడబోమని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు తాము చేస్తున్న ప్రమాదకరమైన చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ హెచ్చరించింది.






