- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి అద్దె కట్టలేక కుటుంబం ఆత్మహత్య.. ఏడేళ్ల బాలిక డెడ్‌బాడీ వెలికితీత
కేరళలోని పిరవం సమీపంలోని ఒక నదిలో ఆదివారం ఉదయం ఏడేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది.

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని పిరవం సమీపంలోని ఒక నదిలో ఆదివారం ఉదయం ఏడేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఇంటి అద్దె కట్టలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలో అందరి మృతదేహాలు వెలికితీశామని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం అదే నదిలో నుంచి బాలిక తల్లి, దృష్టి లోపం ఉన్న విజి డెడ్ బాడీతో పాటు ఆమె రెండేళ్ల కుమారుడి డెడ్ బాడీలను వెలికితీశారు. శనివారం బాలిక తండ్రి నారాయణన్ మృతదేహం లభించగా.. బాలిక మృతదేహం కోసం తీవ్రంగా గాలించారు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేసి, ఆదివారం ఉదయాన్నే ప్రారంభించగా.. బాలిక డెడ్ బాడీ కూడా లభించింది.
తల్లి విజి, ఆమె కుమారుడి వివరాల ఆధారంగా మృతులు కోతమంగళంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లుగా గుర్తించారు. పాలక్కాడ్ కు చెందిన నారాయణన్ తన కుటుంబంతో కలిసి అక్కడ స్థిరపడ్డారు. అయితే చేసే పనికి వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించడమే భారంగా మారడంతో.. ఇంటి అద్దె చెల్లించలేక పోలీసులను సహాయం కోరారు. పోలీసులు సదరు కుటుంబానికి ప్రత్యామ్నాయ వసతి కూడా ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆదివారమే వారంతా కొత్త ఇంటికి మారాల్సి ఉండగా.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం (జూన్ 25)వారంతా పిరవంలోని ఓ హోటల్ లో భోజనం చేసిన అనంతరం.. ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.






