- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ కిచెన్లపై జగన్‌కు మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ రిప్లై.. వేతనాల చెల్లింపుపై క్లారిటీ
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఎక్స్ వేదికగా జగన్ చేసిన పోస్టుపై.. మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లోనే స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఎక్స్ వేదికగా జగన్ చేసిన పోస్టుపై.. మంత్రి నారా లోకేశ్ ఎక్స్ లోనే స్పందించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితో పాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తోంటే ఉసూరుమంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ఆయా స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్ కమ్ హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదన్నారు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే జగన్ ఎందుకు ఏడుస్తున్నారు? పేదలు బాగుపడితే చూడలేరా? అని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశామని స్పష్టం చేశారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదని తెలిపారు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదన్న లోకేశ్.. మరి జగన్ ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా జగన్ సహించలేకపోతే ఎలా? అని నిలదీశారు.






