- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎండలతో అల్లాడిపోతున్న ఫ్రాన్స్.. 4 రోజుల్లో 1000 మరణాలు
పశ్చిమ ఐరోపా దేశాలు ప్రస్తుతం ఎన్నడూ లేనంతటి అత్యంత భయంకరమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ ఐరోపా దేశాలు ప్రస్తుతం ఎన్నడూ లేనంతటి అత్యంత భయంకరమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశాన్ని దారుణమైన ఎండలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి ఫ్రాన్స్‌లోని 'పిస్సోస్' అనే చిన్న పట్టణంలో ఉష్ణోగ్రత ఏకంగా 44.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ తీవ్రమైన వడగాలుల (Heatwave) కారణంగా కేవలం గడిచిన 4 రోజుల్లోనే 1000 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు.
ప్రాణాంతక 'హీట్ డోమ్'.. యూరప్ అంతటా హై అలర్ట్
పశ్చిమ ఐరోపా అంతటా వేడి గాలిని ఒకచోటే బంధించి ఉంచే 'హీట్ డోమ్' (Heat Dome) అనే వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ అసాధారణ ఉషోగ్రతలు ఏర్పడ్డాయని, వీటిని "ఒమేగా బ్లాక్" అంటరాని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అనగా.. రెండు అల్పపీడనాలు మధ్య చిక్కుకున్న అధికపీడన వ్యవస్థనే ఒమేగా బ్లాక్ అంటారు. ఈ మూడు పీడన వ్యవస్థలు కలిసినపుడు ఒమేగా ఆకారం ఏర్పడి ఎయిర్ ట్రాఫిక్ జామ్ తలెత్తుతుంది.దీనివల్ల 'అట్లాంటిక్' నుంచి చల్లటి గాలులు యూరప్ లోకి ప్రవేశించవు. మేఘాలు ఏర్పడక సూర్యకిరణాలు డైరెక్టుగా భూమిని తాకుతాయి. ఈ వాతావరణ పరిస్థితి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఒమేగా బ్లాక్ ఎఫెక్టు వల్ల దాదాపు 20 కోట్ల మంది ప్రజలు ప్రమాదకరమైన వేడిని ఎదుర్కొంటున్నారు. ఫ్రాన్స్‌తో పాటు స్పెయిన్‌లో కూడా ఈ ఎండల వల్ల కేవలం నాలుగు రోజుల్లోనే కనీసం 212 మంది మరణించినట్లు అంచనా వేస్తున్నారు. అటు బ్రిటన్‌లో సైతం రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
ఈ అసాధారణ వేడి కారణంగా పారిస్ మరియు రోమ్ వంటి ప్రముఖ నగరాలలో జనజీవనం స్తంభించిపోయింది. ఫ్రాన్స్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన ఈఫిల్ టవర్, లూవ్ర్ మ్యూజియం వంటి వాటి సందర్శన వేళలను అధికారులు భారీగా తగ్గించారు. ఇటలీలోని రోమ్, మిలన్ వంటి 16 నగరాలకు అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ ప్రకటించారు. వేలాది పాఠశాలలను మూసివేశారు. రైలు ప్రయాణాలను కూడా రద్దు చేశారు.






