- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా.. బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా
మరణశిక్ష తీర్పు ఉన్నా వెనక్కి తగ్గనని, ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్ తిరిగొస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా తాను స్వదేశానికి తిరిగి వెళ్లడంపై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే తాను బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. తాజాగా ఓ జాతీయ టీవీకి ఇచ్చికి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తనపై స్వదేశంలో మరణశిక్ష తీర్పు, పార్టీపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తాను ఏమాత్రం వెనక్కి తగ్గబోనని చెప్పారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె అయిన షేక్ హసీనా 2024 ఆగస్టు 5న పదవి నుంచి వైదొలగిన నాటి నుంచీ భారత్‌లో అశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
భయపడేదాన్ని కాదు:
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో షేక్ హసీనా (Sheikh Hasina)ను దోషిగా తేల్చుతూ ఆమెకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించడంపై హసీనా స్పందించారు. నా పునరాగమనం అనేది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినది కాదు. అది బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ హక్కులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అని చెప్పారు. నాపై వచ్చిన తీర్పు న్యాయబద్ధమైనది కాదని అది రాజకీయ ప్రతికార చర్య అన్నారు. 1975లో నా కళ్ల ముందే నా తల్లిదండ్రులను, సోదరులను, కుటుంబం మొత్తాన్ని చంపేశారు. నాపై ఎన్నో గ్రెనేడ్ దాడులు, కుట్రలు జరిగాయి. నేను చావుకు భయపడను. అన్ని అడ్డంకులను దాటుకుని ఈ ఏడే నా దేశానికి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.
అవామీ లీగ్ కాగితాల సంస్థ కాదు:
మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం, ప్రస్తుత బీఎన్‌పీ (BNP) పాలనలో దేశం తీవ్రంగా నష్టపోతోందని ఆమె మండిపడ్డారు. 77వ వసంతంలోకి అడుగుపెట్టిన అవామీ లీగ్‌ను అణచివేయడం ఎవరి తరం కాదన్నారు. మా పార్టీ ఏమి కాగితాలకు పరిమితమైన సంస్థ కాదని బెంగాల్ గడ్డలో, అక్కడి ప్రజల గుండెల్లో వేళ్లు ఊనుకున్న ఒక రాజకీయ శక్తి అన్నారు. నా నాయకులపై కేసులు పెట్టినా పాలకుల ఆగ్రహానికి మా పార్టీ ఎన్నడూ భయపడదన్నారు.






