- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో నటీనటుల కంటే కూడా పాత్రలే చాలా గొప్పవి: కంగనా రనౌత్
నటిగా తన ఎదుగుదలకు మనసుకు హత్తుకునే బలమైన కథలే ముఖ్య కారణమని ఆమె వివరించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఓ వైపు రాజకీయాల్లో రాణిస్తూనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కంగనా నటించిన ‘ఎమర్జెన్సీ’ బాక్సాఫీసు వద్ద పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ఇటీవల కంగనా ‘భారత్ భాగ్య విధాత’తో వచ్చిన ఆమె.. తన నటనతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇందులో ధైర్యవంతురాలైన నర్స్ పాత్రలో ఒదిగిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుంచో తనపై ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూనే వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ.. ఆ విమర్శలు మాత్రం తనను అస్సలు వదలడం లేదని పేర్కొన్నారు. హిందీ ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా సాగిన తన కెరీర్‌ను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నటిగా తన ఎదుగుదలకు మనసుకు హత్తుకునే బలమైన కథలే ముఖ్య కారణమని ఆమె వివరించారు. తన కెరీర్ మొదటి నుండి కూడా అలాంటి విభిన్నమైన కథలకే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చానని చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల కంటే కూడా వారు పోషించే పాత్రలే చాలా గొప్పవని తాను బలంగా నమ్ముతానని కంగనా స్పష్టం చేశారు. అయితే, అలాంటి గొప్ప పాత్రలు మన దగ్గరకు రావడానికి ఎంతో సహనం, ఓర్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోలు చేసే రొటీన్, కమర్షియల్ సినిమాలకు ‘నో’ చెప్పడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ క్రమంలో ఎంతోమందికి మనం టార్గెట్ అవ్వాల్సి వస్తుందని, ఒక్కోసారి ఇండస్ట్రీలో ఉండే కొందరు వ్యక్తులు మనకు దక్కాల్సిన సినిమాలను కూడా రాకుండా అడ్డుపడతారని సంచలన వ్యాఖ్యలు చేశారుఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ మన మనసుకు నచ్చని కథలను ఎప్పుడూ దూరంగానే పెట్టాలని కంగనా రనౌత్ సూచించారు. అలా రిస్క్ తీసుకుని నచ్చని సినిమాలను తిరస్కరించినప్పుడే, ఒక సాధారణ రెగ్యులర్ హీరోయిన్ల లిస్ట్‌లో కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుందని చెప్పారు. తాను కూడా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ.. తన కెరీర్‌ను అలాగే ఎంతో పట్టుదలతో బిల్డ్ చేసుకున్నానని, అందుకే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని కంగనా గర్వంగా చెప్పుకొచ్చారు.






