నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మన్‌ కీ బాత్ 135వ ఎపిసోడ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకున్నారు.

నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు ప్రజలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నగరాల్లో కాలుష్యం తగ్గేందుకు అనేక చర్యలు చేపట్టామని, నగరాల్లో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగం తగ్గించి ప్రజా రవాణా ఎక్కువగా ఉపయోగించాలన్నారు. ఇవాళ మన్‌ కీ బాత్ 135వ ఎపిసోడ్‌లో మాట్లాడిన ఆయన పలు అంశాలపై తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకున్నారు. మూఢనమ్మకాలు వదిలి శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. పీఎం జీవన్‍జ్యోతి బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

బంగారం కొనుగోళ్లపై..

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని నేను దేశప్రజలను కొన్ని విషయాలపై పిలుపు ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కొంతకాలం బంగారం కొనడాన్ని ఆపాలని కోరితే, ప్రజలు సహకరిస్తున్నారని ఇందుకు దేశంలోని ప్రతి పౌరుడికి నేను కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు నా విజ్ఞప్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా అన్ని విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ ప్రాంతాలలో విభిన్నమైన యోగా కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. జూన్‍లో డీఆర్డిఓ (DRDO) పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘లాంగ్-రేంజ్ ల్యాండ్-అటాక్ క్రూయిజ్ మిస్సైల్’ (సుదూర లక్ష్యాలను ఛేదించే భూతల క్రూయిజ్ క్షిపణి) ని విజయవంతంగా పరీక్షించిందని దీనిని డీఆర్డిఓ ప్రయోగశాలలు భారతీయ పరిశ్రమల భాగస్వాములు సంయుక్తంగా అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రస్తుతం మన దేశం సముద్రాల నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా మరియు స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్‌గా) మారుతోందన్నారు.

ఆ పక్షులు అశుభం కాదు:

పర్యావరణాన్ని పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలని సూచించారు. అసోంలో హర్గీలా పక్షులను అశుభసూచకంగా భావిస్తున్నారు. ఇది సరికాదన్నారు. యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నాగాలాండ్ లోని చిన్నారుల ఫుట్ బాల్ లీగ్ ను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. జూన్ నెలలోనే దేశం విమానయాన (ఏవియేషన్) రంగంలో కూడా ఒక పెద్ద విజయాన్ని సాధించిందని ‘మేడ్ ఇన్ ఇండియా’ విధానంలో తయారైన సి-295 (C-295) విమానం తన తొలి విమాన ప్రయాణాన్ని (Maiden Flight) విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలిపారు. ఇది మన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, ఏరోస్పేస్ రంగాలకు సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తూ, ఉపాధి అవకాశాలను పెంచుతోందన్నారు.

Next Story