- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజుకి హృదయపూర్వక అభినందనలు: చిరంజీవి
తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజుకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు.. ఆయన నాకు స్నేహితుడు కాదు, సోదరుడు అంటూ ట్వీట్!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు (Sanjay Jaju) నియమితులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్, సీనియర్ హీరో చిరంజీవి (Chiranjeevi) సోషల్ మీడియా ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో "తెలంగాణ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులైన సంజయ్ జాజుకి నా హృదయపూర్వక అభినందనలు. మీకున్న నిబద్ధత, ముందుచూపు, సుదీర్ఘ పరిపాలనా అనుభవం మిమ్మల్ని సరైన సమయంలో ఈ అత్యున్నత పదవికి తగిన లీడర్‌గా నిలబెట్టాయి. మీ సమర్థవంతమైన పరిపాలనా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. వ్యక్తిగతంగా నాకు మీరు ఎల్లప్పుడూ ఒక మంచి స్నేహితుడి కంటే ఎక్కువగా.. ఒక బ్రదర్ లాంటివారు.
ఈ ప్రతిష్టాత్మకమైన బాధ్యతల్లో మీరు అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. మీకు ఎల్లప్పుడూ నా బెస్ట్ విషెస్!" అని చిరంజీవి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా సంజయ్ జాజుకు ఉన్న క్లీన్ ఇమేజ్, సమర్థత రాష్ట్ర ప్రగతికి ఎంతగానో తోడ్పడతాయని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవితో సంజయ్ జాజుకు దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ కార్యదర్శిగా, సివిల్ సప్లైస్ కమిషనర్‌గా పనిచేసిన కాలం నుండి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ (I&B) కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ జాజు, ఇప్పుడు తెలంగాణ అత్యున్నత పాలనా పగ్గాలు చేపట్టడంపై మెగాస్టార్ తన సంతోషాన్ని ఈ విధంగా పంచుకున్నారు.






