- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు చుక్కలే చిన్నారులకు రక్షణ కవచం : నిర్మలజగ్గారెడ్డి
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం అందరి బాధ్యత అని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం అందరి బాధ్యత అని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలే రక్షణ కవచమని చెప్పారు. జిల్లాలోని ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.లలిత కుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ వనితా సంతోష్, కౌన్సిలర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






