- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలియో రహిత సమాజం అందరి బాధ్యత
పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

దిశ, సత్తుపల్లి : పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. ఆదివారం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎండి రెహనా కమల్ పాషాతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో అవసరమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. నరసింహ, మున్సిపల్ చైర్‌పర్సన్ రిహనా బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, పింగళి సామెలు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ నాయక్, వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు, చిన్నారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






