వర్షాల కోసం 'కప్పతల్లి' ఆటలు.. వరుణుడి కోసం వినూత్న పూజలు!

by Jakkula.Mamatha |

బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు, యువకులు కలిసి వర్షాలు కురవాలని కోరుకుంటూ సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు.

వర్షాల కోసం కప్పతల్లి ఆటలు.. వరుణుడి కోసం వినూత్న పూజలు!
X

దిశ, బజార్ హత్నూర్: బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు, యువకులు కలిసి వర్షాలు కురవాలని కోరుకుంటూ సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు. మేళతాళాల నడుమ గ్రామంలో ఊరేగింపుగా తిరుగుతూ వరుణ దేవుడిని వేడుకున్నారు. వర్షాలు ఆలస్యమవడంతో రైతులు, గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కప్పతల్లి ఆటల సందర్భంగా గ్రామస్తులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ప్రార్థించారు. ఇలాంటి వర్ష ప్రార్థన సంప్రదాయాలు తెలంగాణలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని మేళతాళాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుణ దేవుడు కరుణించి త్వరగా వర్షాలు కురిపించి రైతుల జీవితాల్లో ఆనందం నింపాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

Next Story