- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మహిళలు స్పాటెడెడ్
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్ లో మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్ లో మృతి చెందారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని జమేదారిపుట్టుగ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస వైపు నుంచి వేగంగా వస్తోన్న లారీ.. ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. స్థానికులు, పోలీసులు వారిని ఆటో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మృతులు మురపాల పార్వతి, నర్తు పద్మమ్మ, మండపల్లి తరినమ్మగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






