- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. భారీ విరాళాలు ప్రకటించిన అనంత్ అంబానీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు స్వామివారిని దర్శించుకున్న అనంత్ అంబానీ భారీ విరాళాలు ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుసగా మూడురోజులు సెలవులు కావడంతో.. శుక్రవారం నుంచీ తిరుమలకొండకు భక్తుల రాక పెరిగింది. ఆదివారానికి రద్దీ మరింత ఎక్కువైంది. ఉదయం 7 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా.. నారాయణగిరి షెడ్లు సైతం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం బాటగంగమ్మ గుడివరకూ భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో స్వామివారి దర్శనానికి ఎక్కువసమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఉదయం 8 గంటల తర్వాత వెళ్లే వారికి సర్వదర్శనానికి 24-30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 5-7 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 4-6 గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న (శనివారం) స్వామివారిని 85,582 మంది భక్తులు దర్శించుకోగా.. 44,155 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు సమకూరింది. 4.66 లక్షల లడ్డూలను విక్రయించారు. 3.43 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ దంపతులు
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీకి భారీగా విరాళాలు ప్రకటించారు. రూ.27.5 కోట్లు విలువ చేసే 25 ఎలక్ట్రిక్ బస్సుల్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 25 బస్సులను నడిపే 50 మంది డ్రైవర్లకు జీతభత్యాలను కూడా తామే చెల్లిస్తామని వెల్లడించారు. అలాగే తిరుమలలో చార్జింగ్ స్టేటస్, గుజరాత్ వంతారా తరహాలో తిరుమలలో గోశాక ఆధునీకరణ చేపట్టేందుకు అంగీకారం తెలిపారు.






