రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం.. హత్యేనా?

by Jakkula.Mamatha |

జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామాల మధ్య రోడ్డు పై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు.

రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం.. హత్యేనా?
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామాల మధ్య రోడ్డు పై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. మృతుడిని అంకుశాపూర్‌కు చెందిన మొగిలిగా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మొగిలి శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతితో అంకుశాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story