- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
‘పల్స్ పోలియో’ (Pulse Polio) వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యం కొరకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు (Polio drops) వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు(28 జూన్) ప్రారంభమైన ‘పల్స్ పోలియో’ (Pulse Polio) వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దాదాపు 40.97 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
చిన్నారులకు వేసే ఈ ‘రెండు చుక్కలు’ వారి జీవితాంతం పక్షవాతం వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క చిన్నారి ఆరోగ్యవంతమైన జీవితానికి, వారి బంగారు భవిష్యత్తుకు పల్స్ పోలియో ఎంతో తోడ్పడుతుందని వివరించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికి, దేశాన్ని పూర్తిగా పోలియో రహితంగా (Polio Free India) కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మొదటి రోజు బూత్‌లలో వేయించని వారి కోసం సోమ, మంగళవారాల్లో (జూన్ 29, 30) సిబ్బంది ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.






