- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రావు బహదూర్'పై సుకుమార్ ప్రశంసల జల్లు
సుకుమార్ ప్రశంసలతో 'రావు బహదూర్'పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమకు నచ్చిన సినిమాలను ప్రశంసిస్తూ వీడియోలు విడుదల చేయడం లేదా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మంచి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో స్టార్ దర్శకుడు సుకుమార్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన 'రావు బహదూర్' చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సుకుమార్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది.
సినిమా చూసిన అనంతరం ఆయన స్పందించిన తీరు రికార్డ్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోలో సుకుమార్ సినిమా బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. "ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. ఇది అద్భుతమైన చిత్రం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ తన అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు" అంటూ ఆయన చిత్ర యూనిట్‌ను అభినందించారు. స్టార్ దర్శకుడు సుకుమార్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో 'రావు బహదూర్'పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మరి జూలై 3న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






