- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. 24 గంటల్లో యుద్ధానికి ఎండ్ కార్డ్
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు. మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని, ముందు ఇరాన్, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ను అమలు చేస్తాయని పేర్కొన్నారు. 24 గంటల్లో ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం అధికారికంగా ముగుస్తుందని, 12 రోజుల యుద్ధానికి ఇదే ముగింపు అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో చేసిన పోస్టులో రాసుకొచ్చారు. సీజ్ ఫైర్ పై ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ పోస్టుకు ముందు ట్రంప్.. ట్రూత్ సోషల్ లో "కంగ్రాట్యులేషన్స్ వరల్డ్ ఇట్స్ టైమ్ ఫర్ పీస్" అని పోస్టు పెట్టారు. దాంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆయన శాంతి చర్చలు జరుపుతున్నారని కొందరు కామెంట్స్ చేశారు. అనుకున్నట్లుగానే ట్రంప్ ఇరు దేశాల మధ్య శాంతి కుదిర్చినట్లు తాజా ప్రకటనతో స్పష్టమైంది.
Read More..
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు: ఇరాన్
ఇరాన్ ప్రతీకార దాడులపై స్పందించిన ట్రంప్.. థాంక్స్ అంటూ వ్యాఖ్య






