ఇరాన్ ప్రతీకార దాడులపై స్పందించిన ట్రంప్.. థాంక్స్ అంటూ వ్యాఖ్య

by Naga Rani Yarlagadda |

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ఉధృతమవుతున్న సమయంలో.. ఇరాన్ "ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్" పేరుతో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులకు పాల్పడింది.

ఇరాన్ ప్రతీకార దాడులపై స్పందించిన ట్రంప్.. థాంక్స్ అంటూ వ్యాఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ఉధృతమవుతున్న సమయంలో.. ఇరాన్ "ఆపరేషన్ బషరత్ అల్ ఫాత్" పేరుతో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణి దాడులకు పాల్పడింది. మొత్తం 14 క్షిపణులు ప్రయోగించగా, వాటిలో 13 మిసైళ్లను అడ్డుకున్నామని అధికారులు వెల్లడించారు. మిగిలిన ఒక క్షిపణి ఎలాంటి నష్టాన్ని కలిగించకపోవడంతో దాన్ని వ్యవస్థ తేలిగ్గా ఎదుర్కొంది.

ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. “ఇరాన్ చాలా బలహీనమైన ప్రతిస్పందన మాత్రమే చూపించింది.” అని వ్యాఖ్యానించారు. తమ ప్రతినిధులు, ఖతార్‌లోని పౌరులు ఎవ్వరూ ఇరాన్ దాడుల్లో గాయపడకపోవడం శుభపరిణామమన్నారు.

ఇరాన్ ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం వల్ల తమ బలగాలు అప్రమత్తమయ్యాయని, ప్రాణహానిని నివారించగలిగామని ట్రంప్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వ్యంగ్యంగా ఇరాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇకనైనా ఇరాన్ శాంతి మార్గంలో అడుగులు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. మిడిల్ ఈస్ట్‌లో శాంతికి ప్రాధాన్యత ఇస్తూ ఇజ్రాయెల్‌ను శాంతి ఒప్పందాలకు ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి ఖతార్ ఎమిర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story