- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరలేదు: ఇరాన్
ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Isreal) మధ్య గత 12 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Isreal) మధ్య గత 12 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని, సోషల్ మీడియా ట్రూత్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రకటించాడు. ట్రంప్ ప్రకటనపై తాజాగా ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్పారు. కాల్పుల విరమణపై ట్రంప్ పోస్టు పెట్టిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) మంగళవారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
'ఇజ్రాయెల్‌లే మాపై యుద్ధం ప్రారంభించింది. ఈ విషయాన్ని మేము ఇప్పటికే స్పష్టం చేశాం. ఇజ్రాయెల్ తన దాడులను ఆపితే మాత్రమే తాము దాడులను ఆపుతాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం లేదు. అయితే, టెల్‌అవీవ్ మా ప్రజలపై చేస్తున్న దురాక్రమణను ఈరోజు ఉదయం 4 గంటల్లోపు (స్థానిక కాలమానం ప్రకారం) ఆపేయాలి. ఈ సంఘర్షణలను కొనసాగించాలనే ఉద్దేశం మాకు లేదు. మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయతం తర్వాత ప్రకటిస్తాం' అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులకు తామూ కౌంటర్ దాడులు చేస్తున్నామని, తమ రక్షణ హక్కును సమర్థంగా వినియోగించుకుంటామని ఈ సందర్భంగా ఇరాన్ స్పష్టం చేసింది. అలాగే ఇలాంటి ప్రకటనలు ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడం బాధాకరమని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఇరాన్ అధికారులు విమర్శించారు.
కాగా, ఇరాన్, ఇజ్రాయెల్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని, 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఈ కాల్పుల విరమణకు తొలుత ఇరాన్ అంగీకరించిందన్నారు. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుందని తెలిపారు. అయితే, ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా టెహ్రాన్ ప్రకటించడం గమనార్హం. ఇక దీనిపై ఇజ్రాయెల్ (Israel) ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read More..
ఇరాన్ ప్రతీకార దాడులపై స్పందించిన ట్రంప్.. థాంక్స్ అంటూ వ్యాఖ్య






